అరాచక పాలనకు సాక్ష్యం..
కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే వందలాది మంది ఉపాధిని తీసేసింది. కక్షసాధింపుతో ఫీల్డ్ అసిస్టెంట్లను, వలంటీర్లను, ఎండీయూ ఆపరేటర్లను, వెలుగు సిబ్బందిని, కేజీబీవీల్లోనూ, ఇతర శాఖల్లోనూ తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న చిరుద్యోగులను, వంట కార్మికులను నిర్ధాక్షిణ్యంగా తొలగించారు.
●తాము అధికారంలోకి వస్తే రూ.10 వేల చొప్పున గౌరవ వేతనమిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నాయకులు వలంటీర్లకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మూడు నెలలు గాలిలో ఉంచి, తర్వాత ఆ వ్యవస్థే లేదంటూ జిల్లాలోని 5,356 మంది వలంటీర్ల బతుకు తీశారు.
●పేదలకు ఇంటింటికీ రేషన్ అందించాలన్న సదుద్దేశం.. కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఆశయంతో గత ప్రభు త్వం ఎండీయూ వాహనాలను అందుబాటు లోకి తెచ్చింది. ఈ వ్యవస్థను నమ్ముకుని జిల్లా లో 196 మంది ఎండీయూ ఆపరేటర్లు, హెల్ప ర్లు బతుకు వెళ్లదీసేవారు. కక్షపూరితంగా ఆ వ్యవస్థను కూడా రద్దు చేసి.. వందలాది కు టుంబాలను ఈ ప్రభుత్వం వీధిన పడేసింది.
●గత వైఎస్సా ర్‌సీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ఒక్కో షాపునకు సూపర్‌వైజర్, సేల్స్‌మెన్లు, రాత్రి కాపలాదారులను నియమించింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసి, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. దీంతో గత ఐదేళ్లూ ఉపాధి పొందిన జిల్లాలోని 53 దుకాణాల సిబ్బంది రోడ్డున పడ్డారు.
●ఎన్నో ఏళ్లుగా ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న పదుల సంఖ్యలో క్షేత్ర సహాయకులు, మేట్లను రాజకీయ కక్షతో తొలగించారు. సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ.. ఇలా ఏ నియోజకవర్గంలోనూ మినహాయింపు లేదు. సాలూరు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. వెలుగులో పని చేస్తున్న వీవోఏలు, కేజీబీవీల్లోని బోధనేతర సిబ్బంది, పలు శాఖల్లోని కంప్యూటర్ ఆపరేటర్లనూ వదల్లేదు. తనను నిర్ధాక్షిణ్యంగా తొలగించారని పార్వతీపురం పురపాలక సంఘం ఎదుట ఓ మహిళ పట్టపగలే నిరసన వ్యక్తం చేసినా.. పలువురు చిరుద్యోగులు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించినా.. ఏ ఒక్కరికీ వినిపించలేదు, కనిపించలేదు.
అరాచక పాలనకు సాక్ష్యం..


