గజపతినగరం: గజపతినగరంలోని సాయిసిద్ధార్థ డిగ్రీ కళాశాలలో నిర్వహించే వృత్తి విద్యాకోర్సు జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను విజయవంతం చేయాలని ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎం.ఆదినారాయణ కోరారు. స్పాట్ కేంద్రంలో అధ్యాపకులతో సోమవారం మాట్లాడారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో సీపీఓ వినోద్, కె.రమణ, వి.విజయలక్ష్మి, ఏసీఓలు వి.అప్పారావు, వై.శ్రీనివాసరావు, స్ట్రాంగ్ రూమ్ ఇన్‌చార్జి కాళ్ల గోవిందరావు, కాంట్రాక్ట్ లెక్చరర్ల రాష్ట్ర మీడియా ప్రతినిధి దుగ్గివలస రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ
పర్యవేక్షణ అధికారి ఎం.ఆదినారాయణ