ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇళ్లు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇళ్లు తొలగించాలి

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

తాడికొండ: ఎన్‌–8 రహదారి నిర్మాణం వలన ఇళ్లు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించి ప్రత్యామ్నాయం చూపిస్తే ఇళ్లు నిర్మించుకున్న అనంతరం తమ గృహాలను తొలగించాలని ఏపీ సీఆర్డీయే నిర్వహించిన గ్రామసభలో బాధితులు కమిషనర్‌ విజయ రామరాజుకు తెలిపారు. ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో మంగళవారం మందడం గ్రామంలో భూ సేకరణ గ్రామసభను నిర్వహించారు. రంజిత్‌ అనే రైతు మాట్లాడుతూ గ్రామకంఠం కింద తనకున్న 58 సెంట్లు భూమిలో పాలవాగు, ఎన్‌–8 రహదారి పోతుందని, అది పోగా మిగిలిన భూమిని కూడా తీసుకొని తనకు మొత్తం ఒకే చోట భూమి ఇవ్వాలని కోరాడు. కమిషనర్‌ వి విజయరామరాజు మాట్లాడుతూ రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో అడిషనల్‌ కమిషనర్లు ఏ భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్‌, ఏపీ సీఆర్డీయే ప్లానింగ్‌ విభాగ డైరెక్టర్‌ బి సురేష్‌ కుమార్‌, డైరెక్టర్‌– ల్యాండ్స్‌(క్యాపిటల్‌ సిటీ) ఎన్‌ వసంత రాయుడు, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఎస్‌ రవీంద్ర ప్రసాద్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు పి మధుసూదనరావు, ఎం శేషిరెడ్డి, తహసీల్దార్లు పి సతీష్‌, డి సునీల్‌ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మందడం గ్రామసభలో సీఆర్డీయే

అధికారులకు మొరపెట్టుకున్న గ్రామస్తులు

Advertisement
 
Advertisement
Advertisement