పిడుగురాళ్లలో 47.6 డి గ్రీలు | - | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో 47.6 డి గ్రీలు

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

పిడుగురాళ్లలో 47.6 డి గ్రీలు

పిడుగురాళ్ల: పల్నాడు అంటేనే వేసవిలో భానుడు భగభగ అంటాడు. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు తాపానికి అల్లాడిపోయారు. మంగళవారం 45.6 డిగ్రీలు నమోదైంది. బుధవారం ఏకంగా 47.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అయింది. చిరువ్యాపారులు సైతం గొడుగులను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎండలు మండుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సున్నపురాయి క్వారీలు, పరిశ్రమలు ఉండటంతోనే ఉష్ణోగ్రత భారీగా పెరిగిందని చెబుతున్నారు.

అచ్చంపేటలో 44 డిగ్రీలు

అచ్చంపేట: మండలంలో బుధవారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిత్యం రద్దీగా అచ్చంపేట ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. వడగాల్పులు ఎక్కువ కావడంతో జనం బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. అచ్చంపేట – సత్తెనపల్లి ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు పలుచగా కనిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement