పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.2958 టీఎంసీలు. | - | Sakshi
Sakshi News home page

పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.2958 టీఎంసీలు.

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.2958 టీఎంసీలు. మున్ముందు తీవ్ర వడగాలులు

రాబోయే నాలుగు రోజులపాటు పల్నాడు జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అవసరమైన మందులు వైద్య శాఖ అందుబాటులో ఉంచాలి. ఉపాధి హామీ కూలీలకు పని వేళల్లో మార్పులు చేయాలి. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలి. మూగ జీవాలకు ఇబ్బంది కలగకుండా, వాటికి తగిన నీటి సౌకర్యం, షెడ్ల వద్ద తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలి. వడగాల్పుల తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

– సంజనా సింహ,

ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌, పల్నాడు జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement