న్యూస్‌రీల్
చంద్రబాబు సర్కార్ హయాంలో ఆసుపత్రుల్లో దుస్థితి పలు పోస్టుల ఖాళీ అయినప్పటికీ భర్తీకి చర్యలు శూన్యం నిర్లక్ష్యంతో మూలకు చేరిన రెండు ఆక్సిజన్ ప్లాంట్‌లు ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న రోగులు తగిన మందులు అందుబాటులో లేక పేదలకు అవస్థలు అధ్వానంగా సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నిర్వహణ
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో..
మెరుగైన సేవలు అందించేందుకు కృషి
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
వసతులకు తూట్లు..
ప్రజా వైద్యానికి చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాల నిర్వహణ తీరు గాడితప్పుతోంది. సిబ్బంది కొరత పీడిస్తోంది. ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది. సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను గురువారం సాక్షి ఫీల్డ్ విజిట్ చేసింది. పేదలకు వైద్య సేవలు మొక్కుబడిగా అందడాన్ని గుర్తించింది.
ఓపీ వద్ద కిటకిటలాడుతున్న రోగులు
సత్తెనపల్లి: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు పలు వ్యాధులతో ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. చికిత్సల సంగతి దేవుడెరుగు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఔషధాలు బయట కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారంతో అల్లాడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను పెంచాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచటంలో విఫలమవుతోంది. ప్రసూతి సేవలకు అవసరమైన పాడ్స్ వంటివి కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. బాలింతలు, గర్భిణులు, శిశువులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత నెల ప్రసవాల లక్ష్యం 100 కాగా ఇక్కడ 129 జరిగాయి. మహిళల స్కానింగ్‌కు సంబంధించి ప్రధానంగా రేడియాలజిస్ట్ లేక కష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యశాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వైద్యశాలలో ఒక సీఎస్‌ఆర్ ఎంఓ, మరో సీఏఎస్, ఒక ల్యాబ్ టెక్నీషీయన్, జనరల్ డ్యూటీ అటెండర్స్ మూడు పోస్టులు, డీఆర్‌ఏ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. బ్లడ్ స్టోరేజీ యూనిట్ ఉన్నప్పటికీ దానిలో సేవలందించే రెండు ల్యాబ్ టెక్నీషీయన్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాక రెండు డేటాఎంట్రీ పోస్ట్‌లు సైతం భర్తీ చేయలేదు. నిత్యం ఉన్న వారిపైనే పని భారం పడుతోంది.
సెంట్రల్ డ్రగ్స్ నుంచి అరకొర మందులు...
ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు ప్రతిరోజు 600 నుంచి 700 వరకు ఓపీలు వస్తున్నాయి. సీజనల్ ప్రభావంతో జ్వరం కేసులు తాకిడి పెరిగింది. అయితే ఇందుకు తగ్గట్టు మందులు, మాత్రలు సెంట్రల్ డ్రగ్స్ నుంచి సరఫరా కావడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వాడేవి కూడా లేవని తెలుస్తోంది. చిన్నపిల్లలకు ఇచ్చే సిరప్‌లు లేవు. వృద్ధులకు ఆయాసానికి సంబంధించి సిరప్ లేదు.
వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గత ప్రభుత్వం పేదల వైద్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను విస్తృతం చేసింది. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసి వైద్య సేవలను అందించింది. పోస్టులు ఖాళీ పడితే వెను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని శాఖలోని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. రేడియాలజిస్ట్‌తోపాటు మరికొన్ని పోస్ట్‌లు ఖాళీ ఉన్నాయి వాటి భర్తీకి ప్రభుత్వానికి నివేదించాం. మందుల కొరత గత నెల మార్చి కావటంతో చివరిలో ఇబ్బంది ఉన్నప్పటికీ అధిగమించేలా లోన్‌బేసిస్‌లో మందులు తెచ్చాం. మందులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నాం. బాలింతలు, నవజాత శివులకు వేడినీళ్లకు సంబంధించి మరో రెండు గీజర్‌లు వచ్చాయి. వాటిని ఏర్పాటు చేస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంట్లు పని చేయడం లేదు.
– డాక్టర్ బి.లక్ష్మణరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల, సత్తెనపల్లి


