మూలకు చేరిన రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు.... | - | Sakshi
Sakshi News home page

మూలకు చేరిన రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు....

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

మూలకు చేరిన రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు....

ఆక్సిజన్‌ విలువ కరోనా సమయంలో అందిరికీ తెలిసి వచ్చింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆక్సిజన్‌ పేదరోగులకు అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వాటిని మూలకు చేర్చారు. ఐటీసీ సహకారంతో 300 లీటర్లు, ప్రభుత్వం మెగా కంపెనీ నుంచి 500 లీటర్ల ఆక్సిజన్‌ ప్లాంట్లను వేరువేరుగా సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలలో ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రస్తుతం పనిచేయడం లేదు. వైద్యశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్లాంట్‌ల నుంచి వైద్యశాలకు వెళ్లే కేబుల్స్‌ కట్‌ కావడంతో మూలకు చేరాయి. అయినప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం లేదు. అంతేగాక చిన్న పిల్లలకు, బాలింతలకు వేడి నీళ్లు అవసరం. ఒక గీజర్‌ మాత్రమే ఉండడంతో ఆ నీటిని బయట హోటల్స్‌లో కొనుగోలు చేయాల్సి న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వేసవికాలం అయినప్పటికీ బాలింతలకు, నవజాత శిశువులకు వేడి నీటిని ఉపయోగించాల్సి ఉంది. వైద్యశాల ప్రాంగణంలో వాహనాల నిలుదలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్ధితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement