ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

ప్రశాంతంగా నీట్‌

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా పరిధిలో నీట్‌–2026 ఆదివారం ప్రశాంతంగా సాగింది. జిల్లా పరిధిలో మూడు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఆయా కేంద్రాలలో 1,323 మంది విద్యార్థులకుగాను 1,285 మంది హాజరయ్యారు. జేఎన్‌టీయూ–ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 696 మందికిగాను 674, ఇర్లపాడు కేంద్రియ విద్యాలయంలో 480 మందికిగాను 469, శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాలలో 147 మందికిగాను 142 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే కేంద్రాలలోకి విద్యార్థులను అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోనికి పంపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయా కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement