పట్టణంలో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయి. కానీ బండ్లకు ఆయిల్ కొట్టడం లేదు. అదేమంటే ఆయిల్ లేదంటారు. తెలిసిన వాళ్లకే అయిల్ కొడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజుకు ఆటో నడుపుకుని బతుకుతున్న ఆటోవాళ్లకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే వారికి ఆయిల్ లేదని చెప్పి ఇబ్బందికి గురిచేస్తున్నారు. అధికారులొచ్చినప్పుడే కొడతాడు. ఆ తరువాత లేదు పొమ్మంటూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అధికారులు నిశితంగా పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
–దేవళ్ల శ్రీనివాస్, మాచర్ల నివాసి


