● 47 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● రూ.1.70 లక్షలు నగదు, రూ.1.58 లక్షల కాయిన్స్ స్వాధీనం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి క్లబ్‌పై జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రత్యేక బృందం ఆదివారం దాడులు నిర్వహించింది. డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు పర్యవేక్షణలో సత్తెనపల్లి రూరల్ సీఐ కె.హైమారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు షేక్ అమీనుద్దీన్, పీ పవన్‌కుమార్, ప్రవీణ్, రాజశేఖర్‌లతోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రత్యేక బృంద సభ్యులు కలిసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. మొత్తం 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.70 లక్షలు నగదు, రూ.1.58 లక్షల కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 27 బైకులు, 5 ఫోర్ వీల్ వాహనాలు, 47 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి క్లబ్‌పై దాడులు పట్టణంలో కలకలం సృష్టించాయి. సత్తెనపల్లి క్లబ్‌ను పునఃప్రారంభిస్తూ ఉదయం కొబ్బరికాయ కొట్టడం .. సాయంత్రానికి పోలీసులు ఇలా దాడులు నిర్వహించడంపై పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 528.20 అడుగులకు చేరింది. ఇది 164.6544 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 3,667, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 5,767 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 5,767 క్యూసెక్కులు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు.


