నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 112 అర్జీలు అందాయి. జేసీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆయా శాఖల పరిధిలో పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్‌పై ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. అర్జీదారులతో మాట్లాడి పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలని సూచించారు. పెండింగ్ అర్జీలు లేకుండా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లో 16 అర్జీలు వచ్చాయి. గురజాల డివిజన్ నుంచి రెండు, సత్తెనపల్లి డివిజన్ నుంచి ఐదు, నరసరావుపేట డివిజన్ నుంచి తొమ్మిది అర్జీలు అధికారులకు అందాయి.
జాయింట్ కలెక్టర్ సంజనా సింహ


