పిడుగురాళ్లరూరల్: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీ నిర్మాణంపై సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేసి పల్నాడు ప్రాంత ప్రజలకు అందించాలన్నారు. మెడికల్‌కాలేజీ వలన ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందని, పల్నాడు ప్రాంతానికే కాకుండా మిగిలిన కొన్ని జిల్లాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్లర్ కృతికా శుక్లా మాట్లాడుతూ.. జరుగుతున్న పనులపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా ఆక్సిజన్, ఓపీకి సంబంధించిన సమస్యలు లేకుండా చూడటం, సిబ్బంది రిక్రూట్‌మెంట్ వంటి పనులు నిర్వహిస్తున్నా మని అన్ని త్వరగా పూర్తి చేసి త్వరలోనే వైద్యశాలలో ఓపీ ప్రారంభించటంతోపాటు కళాశాల నిర్వాహణ కూడా చేస్తామని ఆమె తెలిపారు.


