రామాలయాన్ని నిర్మించిన ముస్లిం భక్తుడు | - | Sakshi
Sakshi News home page

రామాలయాన్ని నిర్మించిన ముస్లిం భక్తుడు

Mar 27 2026 9:12 AM | Updated on Mar 27 2026 9:12 AM

మాచర్ల రూరల్‌: భద్రాద్రి శ్రీ సీతారామ దేవస్థాన నిర్మాణంలో భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించి తన స్వామి భక్తిని చాటుకుంటే.. మాచర్ల మండలం జమ్మలమడకలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి రామాలయాన్ని నిర్మించి రామభక్తిని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన షేక్‌ సైదా సాహెబ్‌ 1996 సంవత్సరంలో గ్రామ శివారులోని సుమారు ఎకరం స్థలంలో శ్రీసీతారామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన తన భక్తిని చాటుకున్నాడు. ముస్లిం వ్యక్తివి.. హిందూ దేవుళ్లకు చెందిన రామాలయాన్ని నిర్మించటమేటంటూ పెద్దలు వారించినా వినకుండా శ్రీరామునిపై తనకున్న భక్తిని విడవకుండా ఆలయాన్ని నిర్మించాడు. సైదా సాహెబ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావటం విశేషం. సుమారు 8సంవత్సరాల క్రితం అనారోగ్యంతో షేక్‌ సైదా సాహెబ్‌ ఆలయ ప్రాంగణంలోనే మృతిచెందాడు. సాహెబ్‌ భక్తి భావాన్ని ఆదర్శంగా తీసుకొని.. ఆయన్ను తలచుకుంటూ గ్రామస్తులంతా ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తుంటారు.

రామాలయాన్ని నిర్మించి

మతసామరస్యత చాటిన సైదా సాహెబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement