పకడ్బందీగా జనగణన నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా జనగణన నిర్వహించండి

Mar 27 2026 9:12 AM | Updated on Mar 27 2026 9:12 AM

నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ సంజన సింహ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రెండవ దశ ఫీల్డ్‌ ట్రైనర్లు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో జనగణన డేటా సేకరణపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని అన్నారు. ‘మన గణన–మన భవిష్యత్తు’ అనే నినాదంతో జరుగుతున్న ఈ మహా యజ్ఞం దేశ ప్రగతికి దిక్సూచి వంటిదని, సేకరించే ప్రతి అంకె అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది అని స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని, సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యతని స్పష్టం చేశారు.

మాస్టర్‌ ట్రైనర్లు అఖిల్‌, సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్‌చార్జి రామసుబ్బారావు ,జిల్లా ప్రణాళిక అధికారి పాల్గొన్నారు.

తప్పులు లేకుండా రీ సర్వే చేయాలి

మాదల(ముప్పాళ్ళ): రీ సర్వే ప్రక్రియను నిర్ణీత కాలంలో తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనాసింహ ఆదేశించారు. మండలంలోని మాదల గ్రామంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వే నెంబర్‌ 614,615 ల జరుగుతున్న రీసర్వే ను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడారు. సత్తెనపల్లి డివిజనల్‌ సర్వే అధికారి విజయ్‌కుమార్‌, మండల తహసీల్దార్‌ కే.నగేష్‌, మండల సర్వేయర్‌ తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌ అర్జీలు క్లియర్‌ చేయాలి.

పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో అందిన అర్జీలను విచారించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనాసింహ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంను గురువారం సందర్శించి వెబ్‌ల్యాండ్‌ మ్యుటేషన్స్‌, కరెక్షన్స్‌, మీ సేవ, ఏపీసేవ పెండింగ్‌ అంశాలను, సుమోటో క్యాస్ట్‌ సర్టిఫికెట్‌లు పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ అందించే సేవలపై రికార్డుల నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు.

నిత్యావసర సరుకుల పంపిణీ తీరు తనిఖీ...

మండల కేంద్రంలోని ముప్పాళ్ళలో 65 సంవత్సరాలు పై బడిన, వికలాంగులకు చౌకధరల దుకాణాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement