పీఆర్కేను కలిసిన ఎస్టీ విభాగం నేతలు | - | Sakshi
Sakshi News home page

పీఆర్కేను కలిసిన ఎస్టీ విభాగం నేతలు

Mar 27 2026 9:12 AM | Updated on Mar 27 2026 9:12 AM

పీఆర్కేను కలిసిన ఎస్టీ విభాగం నేతలు రేపు రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శన నరసరావుపేట ఈస్ట్‌: మున్సిపల్‌ హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల సంఘం నేస్తం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన శ్రీ సుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాల ఆడిటోరియం (ఆలూరి వేణు కళా ప్రాంగణం)లో రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ కొత్త రామమోహన్‌ గురువారం తెలిపారు. ఏపీ కార్టూనిస్టుల సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పోలా త్రివిక్రమరావు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమాలలో భాగంగా కార్టూన్లు– మహిళలు అంశంపై రచయిత్రి వేల్పూరి సుజాత ముఖ్యవక్తగా ప్రసంగిస్తారని, అనంతరం కార్టూన్లు– ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ప్రభావం అంశంపై చర్చావేదిన నిర్వహిస్తామన్నారు. అలాగే కార్టూన్లు గీయటం ఎలా అంశంపై పి.రాము ప్రసంగిస్తారని తెలిపారు. ఆయా కార్యక్రమాలలో కళాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మాచర్ల: వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రంగానాయక్‌, జిల్లా నాయకులు సభావత్‌ రవినాయక్‌, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి దండు మధుబాబు, గిరిజన జిల్లా నాయకులు రమావత్‌ కృష్ణా నాయక్‌, బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మైదాన ప్రాంత గిరిజన విభాగం అధ్యక్షుడు గుండా సుధీర్‌, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మేరాజోత్‌ హనుమంతు నాయక్‌, కాండ్లావత్‌ శ్రీను నాయక్‌లు ఆయన కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు పీఆర్కేను శాలువాతో సత్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాభిమానం కలిగిన వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులను టార్గెట్‌ చేసి జైలుకు పంపిందని, అదే విధంగా పల్నాడు జిల్లాలో ప్రజాభిమాన నాయకుడు పల్నాడు జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను కుట్రతో కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. నియోజక వర్గ గిరిజన నాయకులు రమావత్‌ మాద్యానాయక్‌, కేలా నాయక్‌, రమావత్‌ కృష్ణానాయక్‌, రవీంద్రా నాయక్‌, జాన్‌పాల్‌ నాయక్‌, శ్రీను నాయక్‌, బోజ్యానాయక్‌, సుధాకర్‌ నాయక్‌, పలువురున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి.సురేందర్‌ను గిరిజన నాయకులు సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement