డీఆర్‌డీఏ సమీక్షలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు రైతులకు గరిష్ట ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు
నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో వినూత్నంగా 28 క్లస్టర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా వివిధ రకాల ప్రాసెసింగ్ ప్లాంట్లను గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్‌డీఎ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో రైతులు పండించే పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారానే వారికి మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. ప్రతి మండలంలో గుర్తించిన క్లస్టర్లకు సంబంధించిన డీపీఆర్లు వెంటనే బ్యాంకులకు సమర్పించాలన్నారు.
పొదుపు మహిళల వ్యాపారాభివృద్ధికి ‘సంపన్నకారి’
నరసరావుపేట: స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపారాభివృద్ధికి కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన ‘సంపన్న కారి’ కార్యక్రమం ఒక వరం లాంటిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ చాల వ్యాపారాలు ఒక స్థాయి తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి సరైన మార్గదర్శకం, వ్యాపార ప్రణాళికలు, మార్కెట్ అంశాలపై అవగాహన లేకపోవడం, పెట్టుబడికి వనరులు లేకపొతే ఆ వ్యాపారాన్ని విస్తరించడం కష్టంగా మారుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన కార్యక్రమమే ‘ సంపన్న కారి ‘ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికై న వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్ సహాయం అందించడంతో పాటూ లక్ష వరకు గ్రాంట్ లేదా రూ.4లక్షల వరకు సున్నా వడ్డీ సదుపాయం, వ్యాపార పరంగా శిక్షణ, మార్కెట్ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


