సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ హయాంలో పల్నాడు జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయన్నారు.
మెడికల్ కాలేజీని తెచ్చామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. మెడికల్ కాలేజీపై ఎమ్మెల్యే యర్రపతినేని అవగాహన లేకుండా మాట్లాడారని కాసు మహేష్‌రెడ్డి చెప్పారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోనే వైఎస్సార్ మెడికల్ కాలేజీ పల్నాడు జిల్లాకు వచ్చిందని తెలిపారు.


