రంజాన్ శుభాకాంక్షలు తెలిపి పండ్లు, స్వీట్లు
అందజేసిన మాజీ ఎమ్మెల్యేలు పీఆర్కే, బొల్లా, గోపిరెడ్డి
మాచర్ల: రంజాన్ నెల చివరి రోజున మాచర్ల పట్టణంలోని నూర్ మసీదు, మర్కస్ మసీదుల్లో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులకు పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డిలు రంజాన్ ముందుగా శుభాకాంక్షలు తెలిపి దువా చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడి ఆధ్వర్యంలో నాయకులంతా మసీదులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్తీసాబ్ షేక్ గౌస్ దువా చేసిన అనంతరం ఉపవాసం విడిచిన ముస్లింలకు వారు ఖర్జూర పండ్లు, స్వీట్లు అందజేశారు. ముందుగా పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మసీదు వరకు నడుచుకుంటూ వెళ్ళి ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్, నియోజక వర్గ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, ఉప్పలపాటి జాని, పఠాన్ గౌస్, షేక్ రహమాన్, షేక్ అంగార్‌బాషా, షేక్ సులేమాన్, ఉప్పలపాటి జాని, షేక్ నాగూర్, కిజర్, సైద్‌మస్తాన్, షేక్ జాని, పఠాన్‌బద్రుద్దీన్, అబ్దుల్ రహీం, చికెన్ బాజి, మాయ సుభాని, మహ్మద్ రఫి, పట్టణ పార్టీ అధ్యక్షులు పోలా శ్రీను, మున్సిపల్ మాజీ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి, కామనబోయిన కోటయ్య, కౌన్సిలర్ మందా సంతోష్, వేల్పుల గురవయ్య ్డ తదితరులున్నారు.


