దేశంలోనే ఏపీ టూరిజాన్ని నెం.1 గా చేసేందుకు కృషి
విజయపురిసౌత్: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పర్యాటక శాఖ ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు యం.దారు నాయక్ తో కలిసి పర్యాటక కేంద్రాలైన నాగార్జునసాగర్ లాంచీ స్టేషన్, ఎత్తిపోతలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. నూతన టూరిజం పాలసీతో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ టూరిజం 19 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు తెలిపారు. సాగర్ లాంచీ స్టేషన్‌లో రెండు చిన్న బోట్లను త్వరలోనే నూతనంగా ప్రవేశ పెడతామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఎస్‌ఈ ఈశ్వరయ్య, జీఎం నాంచారయ్య, డీవీఎం కృష్ణ చైతన్య, జిల్లా టూరిజం ఆఫీసర్ నాయుడమ్మ, మేనేజర్లు మస్తాన్ బాబు, యల్లాల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.


