పల్నాడు
న్యూస్‌రీల్
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకుల మృత్యువాత చెదిరిపోయిన తల్లిదండ్రుల ఆశలు బాధిత కుటుంబాలకు భరోసా కరువు
నేర చరిత్రపై ఆరా
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నగరంపాలెం: గుంటూరు ఆర్.అగ్రహారంలోని శ్రీరామనామక్షేత్ర ఆవరణలో శ్రీరామకోటి మహోత్సవాల్లో శనివారం అద్దాల మందిరంలో సీతారాముల పవళింపు సేవ నిర్వహించారు.
నాదెండ్ల/యడ్లపాడు: ఐదుగురు యువకులను డిసెంబరు 4న రోడ్డు ప్రమాదం బలితీసుకున్న ఘటన బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగి ల్చింది. అల్లారు ముద్దుగా పెంచిన వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గుండెలు తల్లిడిల్లుతూనే ఉన్నాయి. ఐదు కుటుంబాల పాలిట తీరని శోకాన్ని మిగిల్చిన చీకటి రోజు అది. ప్రమాదానికి కారకులపై తగిన చర్యలు మాత్రం తీసుకోలేదు. బాధితులకు భరోసా కల్పించలేదు. ప్రకాశం జిల్లా విఠలాపురం గ్రామం మేడిగం రామిరెడ్డి, పల్నాడు జిల్లా శివాపురం, ములకలూరు, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందిన మేరుగ వెంకట నాగశ్రీకాంత్‌రెడ్డి, గోడవర్తి యశ్వంత్‌సాయి, వంగవోలు వాసు, శివరాత్రి మహేష్‌బాబులు విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన వారు మృత్యువాత పడ్డారు. విద్యకోసం అప్పులు, ఎన్నో త్యాగాలు చేసిన వారి ఆశయ సౌధం ఒక్కరాత్రిలోనే కుప్పకూలింది.
సీసీ కెమెరాల లేకుంటే...
ఈ ప్రమాదానికి విద్యార్థుల నిర్లక్ష్యం ఎంతమాత్రం కారణం కాదు. తమ వసూళ్ల దందా కోసం, అధికారుల అవతారమెత్తిన అక్రమార్యుల పాపమే కారణం. వారు వెంబడించి ఓవర్‌టేక్ చేసి ట్రాక్టర్ల ట్రాలర్‌ను కనుసైగతో పక్కకు మళ్లించినందు వల్లే ఈ ఘోరం జరిగిందన్నది వాస్తవం. హైవే బైపాస్‌పై సీసీ కెమెరా లేకుంటే... విద్యార్థుల ప్రాణాలతో పాటు నిజం సమాధి అయ్యేది.
అక్రమ వసూళ్లకు పాల్పడే ముఠా ఈ ప్రమాదానికి కారణం. ఇందులో ఏఎస్‌ఐ కుమారుడు మదమంచి అనుజ్ఞనాయుడు కీలకం కాగా, అతనితోపాటు పుల్లంశెట్టి మహేష్, బెల్లంకొండ గోపి, షేక్ నబిబాష, నాలి వెంకట్రావులను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడికి నేర చరిత ఉన్నట్లు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. తమ బిడ్డల మృతికి కారకులను శిక్షించాలని కన్నవారు కోరుతున్నారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


