పీఏసీఎస్‌ ఉద్యోగుల ఆందోళన బాట | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌ ఉద్యోగుల ఆందోళన బాట

Dec 14 2025 8:37 AM | Updated on Dec 14 2025 8:37 AM

పీఏసీఎస్‌ ఉద్యోగుల ఆందోళన బాట

పీఏసీఎస్‌ ఉద్యోగుల ఆందోళన బాట

పీఏసీఎస్‌ ఉద్యోగుల ఆందోళన బాట ● వేతన సవరణ చేపట్టాలి. అప్పటి వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలి. ● ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీకి సీలింగ్‌ విధించి రూ. 2 లక్షలు మాత్రమే చెల్లిస్తు న్నారు. అలా కాకుండా గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేసి చెల్లింపులు చేయాలి. ● ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. ● ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలి. ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షల టర్మ్‌ ఇన్స్యూరెన్స్‌ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి. ● అనేక సంఘాల్లో ఉద్యోగుల జీతభత్యాలను డ్యూ టు పద్దులో ఉంచారు. ఈ డ్యూ టు పద్దులను రద్దు చేయాలి. ● 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలి. వారికి జీవో నెంబర్‌ 36 అమలు చేయాలి. ● డీసీసీబీల ద్వారా నేరుగా రైతులకు రుణాలు ఇవ్వకుండా పీఏసీఎస్‌ల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ● సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6 శాతం డివిడెండ్‌, కనీస వడ్డీ 6 శాతం చెల్లించాలి. ● ప్రస్తుతం పీఏసీఎస్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ క్లర్క్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈవోలుగా నియమించాలి.

62 పీఏసీఎస్‌లలో 200 మంది ఉద్యోగులు ఆరు నుంచి వివిధ రూపాల్లో ఆందోళన పట్టించుకోని ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అవస్థలు పడుతున్న రైతులు

సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన

సత్తెనపల్లి: చంద్రబాబు సర్కార్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోంది. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు ఈనెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. జిల్లాలో ఉన్న 62 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (పీఏసీఎస్‌) పని చేస్తున్న 200 మంది ఉద్యోగులు యూనియన్‌ పిలుపుమేరకు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపడుతున్నారు. అన్ని పీఏసీఎస్‌లకు వచ్చి పోయే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా ప్రతి రోజూ సుమారు రూ.20 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. నిరసనల కారణంగా ఆయా లావాదేవీలు నిలిచిపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 62 పీఏసీఎస్‌ల పరిధిలో సుమారు 1.20 లక్షల మంది రైతులు పీఏసీఎస్‌ల సేవలు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ ముగియడంతో పలువురు రైతులు పండించిన పంట ఉత్పత్తులు విక్రయించి డబ్బు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు పీఏసీఎస్‌లకు వస్తున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్‌ ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్లో ఉండటంతో ఊసురుమంటూ వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రతి పీఏసీఎస్‌కు ప్రతి రోజూ సుమారు 15 నుంచి 20 మందికి పైగా రైతులు వచ్చి లావాదేవీలు జరుపుతుంటారు. ప్రతి పీఏసీఎస్‌లో నిత్యం రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి.

డిమాండ్లు ఇవే...

జిల్లాలో పీఏసీఎస్‌ ఉద్యోగులు హామీలు నెరవేరక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర యూనియన్‌ పిలుపుమేరకు ఈనెల 6 నుంచి వివిధ రూపాల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాం. జనవరి 5న విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద రాష్ట్రస్థాయిలో మహాధర్నా జరగనుంది. ప్రభుత్వం పీఏసీఎస్‌ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు, ఉద్యోగుల వేదనను గుర్తించి డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన తప్పదు.

– ఆరాధ్యుల శ్రీనివాసరావు, పీఏసీఎస్‌ ఈయూ అధ్యక్షుడు, పల్నాడు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement