యొనుమలను అడ్డుకున్న పోలీసులు
మాచర్ల రూరల్: జంట హత్యల కేసులో అక్రమంగా ఇరికించిన పిన్నెల్లి సోదరులను పరామర్శించేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు, వినుకొండ నియోజక వర్గాల పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గురువారం బస్టాండ్‌లో మురళీధర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు నేడు కోర్టులో లొంగిపోతున్న వారిని కలిసి మాట్లాడదామని వస్తుంటే పోలీసులు అడ్డుకోవటం పై ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడాలని, అధికార పార్టీకి సలాం కొడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ పోలీసులను హెచ్చరించారు.
సంఘీభావం తెలిపే హక్కు కూడా లేదా
గురజాల : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లోంగిపోతున్నారనే సమాచారం రావడంతో సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి,యెనుముల మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘీభావం తెలిపే హక్కు కూడా మాకు లేదా అని ప్రశ్నించారు. కోర్టు కేవలం వారిని సరండర్ కావాలని అర్డర్ ఇచ్చిందే కానీ సంఘీభావం తెలపకూడదని అని ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఒక నిర్భందమైన పరిస్థితి కొనసాగుతుంది. ఎమర్జెన్సీ పాలన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులు ఒక పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందన్నారు.
జె.పంగులూరు: స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు ఎంపిక శనివారం జరగనున్నట్లు కేకేఎఫ్‌ఐ ప్రెసిడెంట్ ఎం. సీరామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి సీనియర్ (మెన్), జూనియర్(బాయ్స్) క్రీడాకారుల ఎంపిక జరగనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో పొల్గొనే క్రీడాకారుల్లో జూనియర్ బాలుర విభాగంలో 31 డిసెంబర్ 2025 నాటికి 18 సంవత్సరాలు లోపు ఉండాలని, 1జనవరి 2008 తరువాత పుట్టిన వారు అయి ఉండాలని తెలిపారు. సెలక్షన్లకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా అధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని తెలిపారు. సీనియర్ (పురుషుల) విభాగంలో ఆధార్ కార్డు, టెన్త్ మార్కులిస్టు మెమో తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9848156652 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
యొనుమలను అడ్డుకున్న పోలీసులు


