22న వినుకొండలో జాబ్‌మేళా
నరసరావుపేట ఈస్ట్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన వినుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్‌లో జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువత జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాకు దాదాపు 35 కంపెనీలు హాజరై అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లోమో, ఇంజినీరింగ్, ఫార్మసీ, పీజీ చదివిన నిరుద్యోగ యువత జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు. విద్యార్హత, ఎంపిక చేసుకున్న కంపెనీల పరంగా రూ.13వేలు నుంచి రూ.35వేలు వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు మాట్లాడుతూ, అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావచ్చని తెలిపారు. వివరాలకు డి.జానీబాషా (99512 14919), సురేష్ (91005 66581), ఎం.వీరాంజనేయులు (91602 00652), ఏ.రమ్య (77029 21219) నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.


