ప్రజారోగ్యాన్ని అంగట్లో పెడితే సహించేది లేదు
నాడు జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల రావాలని కలగంటే ....నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టేందుకు పీపీపీ విధానంతో స్కెచ్ వేసింది. మా ప్రభుత్వంలో పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందాలన్న ఉద్దేశంతో నిర్మించిన భవనాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే. ఇది ముమ్మాటికి నిరుపేదలపై జరుగుతున్న దాడిగా పరిగణిస్తాం. ఈ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదు. కూటమి ప్రభుత్వం మెడలు వంచే ఆయుధాలు ఈ నెల 16న గవర్నర్‌కు సమర్పిస్తాం. చంద్రబాబునాయుడు కుట్రలను బట్టబయలు చేస్తాం. – కాసు మహేష్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే, గురజాల.


