● సిబ్బంది, పోలీసులకు గాయాలు ● ఆక్టోపస్ సిబ్బంది చేత
నరసరావుపేట రూరల్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షను జిల్లాలో సమర్థంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు జరగనున్న టెట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఆర్‌వో అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిఈవో చంద్రకళ, ఇతర అధికారులు పాల్గొన్నారు. డీఆర్వో మాట్లాడుతూ పట్టణంలోని ఐదు కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. పరీక్షలకు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీచేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. స్క్వాడ్స్ నియమించి శాఖాపరమైన అధికారులు పరీక్ష కేంద్రాలను తరచూ తనిఖీ చేసేలా చర్యలు తీసుకుని పర్యవేక్షించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు.
పులిచింతల ప్రాజెక్టు వద్ద మావోయిస్టుల కాల్పులు
అచ్చంపేట: అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు, ప్రాజెక్టుకు సమీపంలోని చెక్‌పోస్టులపై మావోయిస్టులు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో దాడి చేశారు. అక్కడ డ్యూటీలో ఉన్న ప్రాజెక్టు సిబ్బంది, సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద కాపలాగా ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. డ్యామ్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న మావోయిస్టులు డ్యూటీలో ఉన్న ఏఈ రాజుతోపాటు ప్రాజెక్టు సిబ్బందిని నిర్బంధించారు. ప్రాజెక్టు ఏఈ రాజు సమయస్ఫూర్తితో అచ్చంపేట సీఐ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. మావోయిస్టులు తమను నిర్బంధించారని త్వరగా రావాలంటూ సమాచారం అందించారు. అచ్చంపేట సీఐ హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకుని మావోయిస్టులపై కాల్పులు జరిపారు. సుమారు గంటపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. సీఐ శ్రీనివాసరావు ఆక్టోపస్ అధికారులకు తెలియజేయడంతో ప్రత్యేక వాహనంలో బెటాలియన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆక్టోపస్ బెటాలియన్ యూనిట్ మావోయిస్టులపై కాల్పులు జరిపారు. ఐదుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను అచ్చంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన డ్యామ్ సిబ్బందిని, పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం అచ్చంపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. ఇదంతా ప్రాజెక్టుకు మావోయిస్టుల వల్ల ప్రమాదం వాటిల్లితే పోలీసులు, ప్రాజెక్టు సిబ్బంది ఏవిధంగా వ్యవహరించాలి, ఎవరెవరికి సమాచారం అందించాలి, ఆపరేషన్ చేసి మావోయిస్టులను ఎలా లొంగతీసుకోవాలో ప్రయోగాత్మకంగా ఆక్టోపస్ అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్. కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీలు జి.విశ్వనాథం, బి.మధు, పల్నాడు డీఎస్పీ ఏఆర్ జీయం గాంధీరెడ్డి, ఇన్‌స్పెక్టర్స్ ఆర్ రాంబాబు, డి.మధుబాబు, పోలీస్, అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ, పల్నాడు బీడీ టీమ్, ఆక్టోపస్ మాక్స్ డ్రిల్ స్బింది పాల్గొన్నారు.
● సిబ్బంది, పోలీసులకు గాయాలు ● ఆక్టోపస్ సిబ్బంది చేత


