200 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించాలి
సత్తెనపల్లి: జాతీయ లోక్‌అదాలత్‌లో సత్తెనపల్లిలో 200 సివిల్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి న్యాయవాదులు సహకరించాలని గుంటూరు జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయాధికారి వై.నాగరాజా పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 13న స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి మంగళవారం న్యాయవాదులు, పోలీసు అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు అధ్యక్షత వహించిన గుంటూరు జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయాధికారి వై నాగరాజా మాట్లాడుతూ సత్తెనపల్లిలో సివిల్ కేసులు సుమారు 200 రాజీ మార్గం ద్వారా పరిష్కరించడానికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే న్యాయాధికారులు సహకరిస్తారన్నారు. నగదుకు సంబంధించిన ఈపీలు పెద్ద సంఖ్యలో పరిష్కారానికి సహకరించాలని కోరారు. నగదు ఈపీలు పరిష్కారంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. క్రిమినల్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి ఫిర్యాదుదారులకు, నిందితులకు తమ సూచనలు ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి సహకరించాలని పోలీసు అధికారులను కోరారు. సమావేశంలో మూడో అదనపు జిల్లా న్యాయ అధికారి సీహెచ్‌వీఎన్ శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్, స్థానిక న్యాయాధికారులు వి.విజయ్‌కుమార్‌రెడ్డి, తౌషీద్ హుస్సేన్, పి.ప్రియదర్శిని, జె.సృజన్‌కుమార్, న్యాయవాద సంఘం అధ్యక్షుడు గంగూరి అజయ్‌కుమార్, న్యాయవాదులు, సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
కేసుల పరిష్కారానికి సహకరించండి
నరసరావుపేట టౌన్: జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 13వ అదనపు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌కు సంబంధించి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు అధ్యక్షత వహించిన గుంటూరు జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయాధికారి వై. నాగరాజా మాట్లాడుతూ నరసరావుపేటలో సివిల్ కేసులు సుమారు 200 రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి న్యాయవాదులు సహకరించాలన్నారు. ఈ మేరకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే న్యాయాధికారులు సహకరిస్తారన్నారు. నగదుకు సంబంధించిన ఈపీలు పెద్ద సంఖ్యలో పరిష్కారానికి సహకరించాలని కోరారు. నగదు ఈపీలు పరిష్కారంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. క్రిమినల్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి ఫిర్యాదుదారులకు, నిందితులకు తమ సూచనలు ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి సహకరించాలని పోలీసు అధికారులను కోరారు. సమావేశంలో మూడో అదనపు జిల్లా న్యాయ అధికారి సీహెచ్‌వీఎన్ శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్, స్థానిక న్యాయాధికారులు మధుస్వామి, లావణ్య, ఆశీర్వాదం పాల్, సలోమి, గాయత్రి, న్యాయవాద సంఘ అధ్యక్షులు గన్నే వెంకట సుబ్బారావు, ఏపీపీ సురేష్, సీఐలు ఫిరోజ్, సీహెచ్ ప్రభాకరరావు, ఎం.వి సుబ్బారావు, సీహెచ్ లోకనాథం, సబ్ డివిజన్‌లోని ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


