పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా
రొంపిచర్ల: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంతగుడిపాడు జీడీసీసీ బ్యాంక్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. బ్యాంక్, పలు ఉద్యోగ సంఘాల నాయకులు సొసైటీ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చా లని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న 12 సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బ్యాంక్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో విప్పర్ల, సంతగుడిపాడు, రొంపిచర్ల, సుబ్బయ్యపాలెం, బుచ్చి బాపన్నపాలెం, పీఏ సీఎస్‌ల సీఈవోలు భవనం వెంకటేశ్వరరెడ్డి, ఎన్. లక్ష్మీరెడ్డి, డి.వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, సిబ్బంది దీపక్, సాంబయ్య, మల్లికార్జున్, ఎస్.వీరారెడ్డి, సిహెచ్.శివనాగిరెడ్డి, వై.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.


