ఆర్థిక అంశాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: ఆర్థిక పరమైన అంశాలపై పీజీఆర్‌ఎస్‌లో అధిక ఫిర్యాదులు అందాయి. సోదరుడు కష్టాల్లో ఉన్నాడని జాలిపడి బంగారం ఇస్తే ఆ తరువాత స్పందించకుండా పట్టణం విడిచివెళ్లిపోయారని నరసరావుపేటకు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. డబ్బు లు కోసం అప్పుల వాళ్లు ఇబ్బందులు పెడుతున్నారని పరిచయస్తురాలు మాటలు నమ్మి రూ.15లక్షలు ఇస్తే, చెక్, ప్రోనోటు మీద చెల్లకుండా సంతకాలు చేసి మోసం చేసిందని మరో మహిళ ఫిర్యాదులో పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో తన బిడ్డ చనిపోయాడని, నకిలీ ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్‌తో నిందితుడు, ఇన్స్యూరెన్స్ సంస్థ మమ్మల్ని మోసం చేసిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం వంటి సమస్యలకు సంబంధించిన 134 ఫిర్యాదులు అధికారులకు అందాయి.
జిల్లా పోలీసు కార్యాలయంలో
పీజీఆర్‌ఎస్
ఫిర్యాదులు స్వీకరించిన
అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్
అధికారుల దృష్టికి 134 ఫిర్యాదులు


