హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు
తెనాలి: రక్తం కనబడకుండా, ఆయుధం కనిపించకుండా, హింస లేకుండా ఏ తెలుగు సినిమా అయినా వుందా? ఎంత దుర్మార్గమిది...! ఎంత సాంస్కృతిక నేరస్తులు వీళ్లు, సినిమాలు తీసేవాళ్లు...వేషాలు వేసేవాళ్లు అని ప్రముఖ రచయిత, కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. సినిమాల్లో ఒక్కోడు వందమందిని చంపటం, ఏ నేరారోపణ లేకుండా బయటకెలా వస్తారు... ఆలోచించాలని చెప్పారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో రెండురోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాన్ని శనివారం మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్


