ఉత్సాహంగా ఎద్దుల బండ లాగుడు పోటీలు
గురజాల : పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి 427వ తిరునాళ్లను పురస్కరించుకుని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతు సంఘం నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు శనివారం ఉత్సాహభరితంగా జరిగాయి. డీఎస్పీ జగదీష్ ప్రారంభించారు. జూనియర్ విభాగంలో ఆరు జతలు పోటీపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన మేకా ప్రతీక ఎద్దుల జత 2750 అడుగులు లాగి ప్రథమ బహుమతి, గుంటూరు జిల్లా లింగాయపాలేనికి యల్లం సాంబశివరావు ఎద్దుల జత 2000 అడుగులు లాగి ద్వితీయ బహుమతి, గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన నల్లమోతు వీర శంకరరావు ఎద్దుల జత 1934.10 అడుగులు లాగి మూడవ బహుమతిని గెలుచుకున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన యర్రసాని సుబ్బయ్య ఎద్దుల జత 1845.8 అడుగులు లాగి నాలుగో బహుమతిని, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి ఎద్దుల జత 1766.10 అడుగులు లాగి ఐదో బహుమతి, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్ బాబు ఎద్దుల జత 1300 అడుగులు లాగి ఆరో బహుమతిని గెలుచుకున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పోటీల కమిటీ సభ్యులు నల్లా లక్ష్మయ్య, తన్నేటి బుచ్చిబాబు, నెల్లూరి మల్లయ్య, పోటు నాగేశ్వరరావు, విశ్వనాథం, నవులూరి శ్రీరామమూర్తి, చలవాది శ్రీనివాసరావు, షేక్ నాగులు షరీఫ్ పాల్గొన్నారు. డీఎస్పీ జగదీష్‌ను కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు.
ప్రారంభించిన డీఎస్పీ జగదీష్


