అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకుల తప్పులేదు
కట్టమూరు ఎస్సీ–2 అంగన్‌వాడీ కేంద్రంలో సాంబార్‌లో తమ కుమార్తె హారిక పడటంలో అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకుల తప్పేమీ లేదు. ఆడుకుంటూ తమ కుమార్తె పొరపాటున పడింది. వెంటనే వైద్య సేవలు అందించడంతో పూర్తిగా నయమైంది. 20 రోజులుగా యథావిధిగా తిరిగి తమ కుమార్తె హారిక అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతుంది. అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఈ ఉద్దేశంతో అంగన్‌వాడీ కార్యకర్త హైమావతి, అంగన్‌వాడీ సహాయకురాలు నాగ ప్రసన్నను తొలగించడం సరైనది కాదు.
తమ్మిడి హారిక తల్లి నాగలక్ష్మి


