న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలి
సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్‌కుమార్ 4 న్యాయస్థానాల్లో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
సత్తెనపల్లి: న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకురావాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ తీర్మానం మేరకు శుక్రవారం నాలుగు న్యాయస్థానాల్లో విధులను బహిష్కరించి న్యాయవాదులు నినాదాలు చేస్తూ పట్టణంలోని కోర్టు ఆవరణలో గల న్యాయదేవత విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తీసుకురావాలన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిన్నం మణిబాబు, కార్యదర్శులు షేక్ జానీ ఖాజావలి, బయ్యవరపు నరసింహారావు, న్యాయవాదులు సయ్యద్ అబ్దుల్ రహీం, దివ్వెల శ్రీనివాసరావు, నీలగిరి కోటయ్య, కేఎన్‌వీ హరిబాబు, బొక్కా సంగీతరావు, రాజారపు నరసింహారావు, గంపా మదన్, మేదర అనిల్, ఉడుముల విద్యాసాగర్‌రెడ్డి, ఉల్లం మధు, జూపల్లి శేషయ్య, కోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


