కరాటేలో సత్తెనపల్లి విద్యార్థుల ప్రతిభ
సత్తెనపల్లి: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తెనపల్లికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాదు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఎన్‌ఎస్‌ఎన్ కరాటే లీగ్ సీజన్–1 ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించారు. ఈ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో సత్తెనపల్లికి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు రికార్డు స్థాయిలో విజయం సాధించారు. ఆర్గనైజర్ అనుముల వీరబ్రహ్మం, సెన్‌సాయ్, అనుముల రాంబాబు, అనుముల రామయ్యలు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తెనపల్లికి చెందిన విద్యార్థులు భవిష్యత్తులో కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. పోటీల్లో సబ్ జూనియర్ కేటగిరీ కటా విభాగంలో బి.టిష్యంత్ (బంగారు పతకం), ఎల్.గేష్టు(బంగారు పతకం), ఎల్.కిరీట్(బంగారు పతకం), ఎంవీ.బాలాజీ(బంగారు పతకం), తేజ్‌ప్రకాష్(బంగారు పతకం), బి.సత్యనారాయణ(వెండి పతకం), బి.అక్షయరెడ్డి(బంగారు పతకం) బాలికల కాడెట్ కటా విభాగంలో టీ నిఖిత (బ్రౌంజ్ మెడల్), అండర్–21 బాలుర కటా విభాగంలో డీఎంఎస్ రామబ్రహ్మచారి (వెండి పతకం) కై వసం చేసుకున్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలతోపాటు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.


