పాముకాటుకు కూలీ మృతి
చిలకలూరిపేటటౌన్: పంట పొలంలో పాముకాటుకు మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని గంగన్నపాలెం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని గంగన్నపాలెంకు చెందిన జటవతు ప్రియాంతీబాయి(26) సమీప గ్రామమైన కోమటినేనివారిపాలెం వ్యవసాయ పనులకు వెళ్లింది. ఉదయం 11.30 గంటల సమయంలో సాళ్ల మధ్య పత్తితీత పనులు చేస్తుండగా పాముకాటకు గురైంది. గమనించిన సహ కూలీలు పరుగున వచ్చి ఆమెను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాధితురాలిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరంచారు. ప్రియాంతీ బాయి భర్త గణేష్ నాయక్ ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్సై జి అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


