రేపు కోటి సంతకాల ఉద్యమంపై సమావేశం
రొంపిచర్ల: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల ఉద్యమంపై బుధవారం వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభా గం పల్నాడు జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నుపూస రవీంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసి పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తుంద న్నా రు. పేదలకు వైద్యం, వైద్య విద్యను దూరం చేసేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను భగ్నం చేస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారని వివరించారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి స్పందన వస్తుందన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు జరిగే సమావేశంలో మాజీ శాసనసభ్యులు, ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌చార్జిలు, వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు పాల్గొంటారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం
రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి


