
ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక
పిడుగురాళ్ల: సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని కళ్లం టౌన్‌షిప్‌లో ఉన్న స్కాలర్స్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ పురుషుల సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక ఆదివారం నిర్వహించారు. ఎంపికకు జిల్లా నుంచి సుమారుగా 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా ఎంతో మంది అత్యుత్తమ స్థానంలో ఉన్నారన్నారు. గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.సామంత్‌రెడ్డి, కోశాధికారి ఆవుల జనార్దన్ నేతృత్వంలో ఎంపిక నిర్వహించారు. కార్యక్రమంలో స్కాలర్స్ విద్యా సంస్థల డైరెక్టర్‌లు జి.శ్రీనివాస్‌రెడ్డి, మూలగొండ్ల జగదీష్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుమారస్వామి, కొత్త సత్యం, లయన్స్ క్లబ్ సభ్యులు గుండా నారాయణ, కొత్త కాశీవిశ్వనాఽథం, డీవీ స్వామి, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు..
పి.బాలకృష్ణ, బి.రాంబాబు, జె.టైసన్‌బాబు, బి.అనిల్‌కుమార్, ఎం.ప్రేమ్‌కుమార్, వై.గోపి, సాగర్‌బాబు, హేమంతు, సల్మాన్, శివకోటేశ్వరరావు, నరేంద్ర, యశ్వంత్, జానారెడ్డి, జేమ్స్, అభినవ్, ఎం.మెరిసి, ప్రభాకర్, స్టాండ్‌బైలుగా గౌతమ్, శ్రీహర్ష, సంజీవ్‌బాబు, కార్తీక్, పవన్, కిరణ్‌నాయక్‌లు ఎంపికయ్యారు.