పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Oct 20 2025 7:36 AM | Updated on Oct 20 2025 7:52 AM

సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

ఒక్కో దుకాణం అనుమతికి రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు సొంత పార్టీ వారయినా ముడుపులు ఇవ్వకపోతే కొర్రీలు ఈ మొత్తం లాక్కునేందుకు భారీగా ధరలు పెంచిన వ్యాపారులు జిల్లాలో 39 శాశ్వత, 122 తాత్కాలిక దుకాణాలకు అనుమతులు

సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
ఒక్కో దుకాణానికి భారీగా వసూలు...

సత్తెనపల్లి: దీపావళి అంటే గుర్తుకు వచ్చేది టపాసులు. కానీ టపాసుల ధరలు తారాజువ్వల్లా ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని అంటుకోక ముందే ధరలు పేలుతున్నాయి. దీంతో సామాన్యులకు పెనుభారంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా ఈ దీపావళికి టపాసుల ధరలు పెరగడానికి కూటమి నేతలే కారణమని ప్రజలు మండిపడుతున్నారు. పర్వదినాన్ని వారు కాసుల వసూళ్ల పండుగ గా మార్చేశారు. టపాసుల దుకాణాలకు నిబంధనలను పక్కాగా పాటించినా తమ చేతులు తడపకుంటే అనుమతులు జారీ చేసేది లేదని కూటమి నేతలు తెగేసి చెబుతున్నారు. దీపావళి సందర్భంగా జిల్లాలో తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు చేతివాటం ప్రదర్శించారు. నేతల తీరు ఇలా ఉంటే దుకాణాల యజమానులు మాత్రం అడిగినంత ఇచ్చి అందినకాడికి దోచుకుందామనే యోచనలో పడ్డారు. జిల్లాలో దీపావళికి తాత్కాలిక ప్రాతిపదికన బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తారు. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్‌, మున్సిపల్‌, పంచాయతీ, జీఎస్టీ విభాగాలు సమన్వయంతో తాత్కాలిక లైసెన్స్‌ మంజూరు చేయడం ఆనవాయితీ. ఇందుకుగాను వ్యాపారులు దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవడం.. ఆపై అనుమతులు ఇవ్వడం ఏటా సాధారణం. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు అక్రమాలకు తెరతీశారు. సందట్లో సడేమియా అన్నట్లు రూ. లక్షలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో షాపునకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లకు తెగబడ్డారు.

ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి...

బాణసంచా విక్రయాల కోసం పలు విభాగాల అధికారులతో కూడిన కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఇక్కడే అసలు చేతివాటం మొదలవుతోంది. తాత్కాలిక విక్రయిదారులకు డీలర్‌షిప్‌ ఉండదు. దీంతో వారికి అడ్వాన్స్‌ లైసెన్సులు జారీ చేస్తారు. దీని ప్రకారం వారు విక్రయించబోయే సరుకు విలువపై 18 శాతం జీఎస్టీని ముందుగానే చెల్లించాలి. రూ. లక్ష విలువైన సరుకు విక్రయిస్తే రూ. 18 వేలు పన్నుగా చెల్లించాలి. వ్యాపారం ముగిశాక అమ్మిన సరుకు విలువ అంచనా కన్నా ఎక్కువైతే మిగిలిన పన్ను చెల్లించాలి. తక్కువ అయితే అదనంగా కట్టిన డబ్బును అధికారులు తిరిగి వెనక్కు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం కొందరు వాణిజ్య పన్నుల విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. వ్యాపారులతో కుమ్మకై ఎంతసరకై నా అమ్ముకో.. ప్రభుత్వానికి కొద్దిగా పన్ను కట్టి, తమకు కొంత సమర్పిస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సర్కిళ్ల వారీగా వసూళ్లకు సిబ్బందిని నియమించి, వచ్చిన మొత్తాన్ని ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పంచుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి.

లైసెన్స్‌ల పేరుతో అడ్డగోలుగా దండుకున్న కూటమి నేతలు

కూటమి నేతల దెబ్బకు పండగకు ముందే ‘వసూళ్ల’ మోత మోగిపోతోంది. తాత్కాలిక దుకాణాల అనుమతుల పేరుతో వ్యాపారుల నుంచి వారు వసూళ్లకు తెరలేపారు. అధికారులకు ఇవ్వాలంటూ అందినకాడికి దండుకున్నారు. నిబంధనల పేరుతో వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేశారు. ఫలితంగా వారికి భారీగా ఇవ్వాల్సి వచ్చింది. ఆ లోటు పూడ్చుకునేందుకు వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. టపాసుల ధరలు అమాంతం పెంచి ప్రజల నెత్తి మీద రుద్దేశారు. కూటమి నేతలకు మామూలు ముట్టజెప్పడంతో అధికారులు కూడా నిద్ర నటిస్తున్నారు. టపాసుల ధరలు ఇష్టారాజ్యంగా పెంచి అమ్మినా అడిగే వారే కనిపించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.

నిల్వలపై చర్యలేవి?

జిల్లాలో 39 శాశ్వత బాణసంచా కేంద్రాలు, 122 తాత్కాలిక కేంద్రాలు ఉన్నాయి. ఈ విక్రయ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. కూటమి నేతలు, అధికారులు అందిన కాడికి మామూళ్లు దండుకొని దుకాణాల్లో భారీగా నిల్వలు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో బాణసంచా నిల్వలను వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నా మిన్నకుండిపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పరిమితికి మించి నిల్వలు చేసినప్పటికీ హడావుడి చేయడం ... అనంతరం మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది.

బాణసంచా తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే సదరు వ్యాపారి ప్రభుత్వం నిబంధనల మేరకు లైసెన్స్‌ నిమిత్తం అగ్నిమాపక శాఖకు రూ. 500 చలానా, రెవెన్యూ శాఖకు రూ. 500 చలానా, జీఎస్టీ విభాగానికి రూ. 5 వేల మేరకు అడ్వాన్సు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఓ దుకాణానికి రూ. 6 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ కూటమి నేతలు ఇక్కడ అంతకు మించి దండుకుంటున్నారు. తాత్కాలిక దుకాణాల లైసెన్స్‌ మంజూరులో అంతులేని అక్రమాలు జరుగుతున్నాయి. కూటమి నేతలు అడ్డగోలు వ్యవహారానికి తెరతీశారు. ఒక్కో దుకాణానికి రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు దండుకున్నట్లు సమాచారం. జిల్లాలో 122 తాత్కాలిక దుకాణాలకు ఇప్పటికే అధికారులు అనుమతులు ఇచ్చారు. ఒక్కో షాపు నుంచి రూ. 25 వేల చొప్పున లెక్క కట్టినా రూ. 30.50 లక్షలు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో దుకాణానికి రూ. 6 వేల చొప్పున కలిపి మొత్తం రూ.7.32 లక్షల ప్రభుత్వానికి వెళ్లగా .. మిగిలిన సుమారు రూ. 23 లక్షలు కూటమి నేతల జేబులోకి చేరినట్లు ఆరోపణలున్నాయి. మధ్యవర్తుల ద్వారానే లైసెన్సు జారీ అయినట్లు సమాచారం. దీంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు అమాంతంగా పెంచేసి విక్రయిస్తున్నారు.

పల్నాడు1
1/4

పల్నాడు

పల్నాడు2
2/4

పల్నాడు

పల్నాడు3
3/4

పల్నాడు

పల్నాడు4
4/4

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement