
దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలి
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: దీపావళి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. బాణసంచా కాల్చే సమయంలో అందరూ ముఖ్యంగా చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్యావరణానికి హాని లేకుండా కాలుష్య రహిత టపాసులు పేల్చాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పండగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, ఉద్యోగులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
పీజీఆర్‌ఎస్ రద్దు
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీ ఆర్‌ఎస్)ను దీపావళి సందర్భంగా రద్దు చేసినట్లు కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ..
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ను దీపావళి సందర్భంగా ఈ నెల 20వ తేదీ సోమవారం రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 35,723 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 37,443 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలుగా ఉంది.

దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలి

దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలి

దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలి