పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Oct 19 2025 7:05 AM | Updated on Oct 19 2025 7:07 AM

ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం పథకాన్ని ఇలా పొందవచ్చు...

న్యూస్‌రీల్‌

పీఎం సూర్యఘర్‌తో ఇంటింటా సౌర కాంతులు విద్యుత్‌ కోతలు, లోఓల్టేజీ సమస్యలకు చెక్‌ రాయితీతో సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానెల్‌ జిల్లా వ్యాప్తంగా వినియోగదారులకు అవగాహన కల్పించేలా ర్యాలీలు

పీఎం సూర్యఘర్‌ యోజనను పొందేందుకు గృహ వినియోగదారులు వాడే విద్యుత్‌ యూనిట్లు 300లోపు ఉండాలి.

సూర్యఽఘర్‌ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో వినియోగదారుడు వివరాలు నమోదు చేసుకోవాలి

వరుసగా ఆరు నెలల బిల్లులను జత చేయాలి

అవసరమైన కిలోవాట్‌ల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

మూడు కిలోవాట్‌లలోపు సర్వీస్‌కు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఐదు కిలోవాట్‌లకు రూ.1,900, ఆపై రూ.5,900 చెల్లించాలి. 10 కిలోవాట్‌ల పై బడిన హెచ్‌టీ సర్వీస్‌లకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపంలో రూ.11,900 చెల్లించాల్సి ఉంటుంది.

సబ్సిడీ పోను మిగిలిన మొత్తానికి బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది.

అవకాశం వినియోగించుకోండి

ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 29,820 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 37,773 క్యూసెక్కు లు వదులుతున్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జుసాగర్‌ జలాశయ నీటి మట్టం శనివారం 588.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 53,685 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

విద్యుత్‌ ఎప్పుడు పోతుందో..ఎప్పుడు వస్తుందో తెలియదు...మరో వైపు లో ఓల్టేజీ సమస్య...ఇంకొకవైపు బిల్లు మోతతో వినియోగదారులు సతమతమవుతున్నారు. ఈ కష్టాలకు సోలార్‌తో చెక్‌ పెట్టనున్నారు. సోలార్‌ ఏర్పాటుచేసుకునే వారికి ప్రభుత్వం రాయితీ కల్పించడంతోపాటు ఆదాయం కూడా సమకూర్చనుంది.

సత్తెనపల్లి: గృహ వినియోగదారులు సోలార్‌ విద్యుత్‌ను వాడితే అతి తక్కువ విద్యుత్‌ బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుందని విద్యుత్‌ శాఖ అధికారులు వెల్లడిస్తూ శనివారం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌, మండల కేంద్రాల్లో రాయితీలతో కూడిన వివరాలు తెలిసేలా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఇంటి పైన కనీసం 10 చదరపు అడుగుల స్థలంలో వన్‌ కిలోవాట్‌ సామర్థ్యం కలిగిన సోలార్‌ రూప్‌టాప్‌ను ఏర్పాటు చేసుకుంటే, విద్యుత్‌ ఉత్పత్తి చేసి నిల్వ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా విద్యుత్‌ ఆదా అవుతుందని ప్రయోజనాలపై విద్యుత్‌ శాఖ విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది.

సోలార్‌ రాయితీలు ఇలా...

సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటులో భాగంగా ఒక కిలోవాట్‌తో 120 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నందున, సాధారణంగా రూ.1,000 బిల్లు వచ్చే వినియోగదారునికి రూ.333 మాత్రమే వస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.30 వేలు రాయితీ ఇస్తుంది. రెండు కిలో వాట్‌లతో 240 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నందున, సాధారణంగా రూ.2 వేలు బిల్లు వచ్చే వినియోగదారునికి రూ. 338 మాత్రమే వస్తుంది. దీనికోసం ప్రభుత్వం రూ.60 వేల రాయితీని అందజేస్తుంది. మూడు కిలోవాట్‌లతో 360 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నందున, సాధారణంగా రూ.3 వేలు బిల్లు వచ్చే వినియోగదారునికి తక్కువ విద్యుత్‌ బిల్లు వస్తుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ.78 వేలు రాయితీని అందజేస్తోంది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏపీ సీపీడీసీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా పీఎం సూర్యఘర్‌ పోర్టులో దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్‌ అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు హెలిప్యాడ్‌ వద్ద పుష్పగుచ్ఛం అందజేస్తున్న

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్పీ బీ కృష్ణారావు

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ నాగార్జునకొండ పర్యటనలో భాగంగా శనివారం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా హిల్‌కాలనీకి కుటుంబ సమేతంగా వచ్చారు. గవర్నర్‌ను పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్పీ బీ కృష్ణారావు, గురజాల ఆర్డీఓ వి మురళీకృష్ణలు హెలిప్యాడ్‌ వద్ద మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ జగదీష్‌, మాచర్ల తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, మాచర్ల టౌన్‌ సీఐ ప్రభాకర్‌, విజయపురిసౌత్‌ ఎస్‌ఐ అశోక్‌, పలువురు పోలీస్‌ శాఖ, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు. – విజయపురిసౌత్‌

I

పీఎం సూర్యఘర్‌ పథకంపై వినియోగదారులకు విస్త్రృతంగా అవగాహన కల్పిస్తున్నాం. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపల్‌, మండల కేంద్రాల్లో శనివారం అవగాహనా ర్యాలీలు చేపట్టాం. విద్యుత్‌ బిల్లు ఆదా, కలిగే ఇతర ప్రయోజనాలను తెలియపరుస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు మీ పరిధిలోని సెక్షన్‌ కార్యాలయాల్లో సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.

– కె.రామసుబ్బారావు,

ఈఈ టెక్నికల్‌, పల్నాడు జిల్లా

కిలోవాట్‌ల వారీగా రాయితీ సమాచారం...

కిలోవాట్‌లు ఖర్చు రాయితీ యూనిట్లు

ఒకటి రూ.83 వేలు రూ. 30 వేలు 120

రెండు రూ. 1,14,000 రూ. 60 వేలు 240

మూడు రూ. 2,10,000 రూ. 78 వేలు 360

పల్నాడు1
1/10

పల్నాడు

పల్నాడు2
2/10

పల్నాడు

పల్నాడు3
3/10

పల్నాడు

పల్నాడు4
4/10

పల్నాడు

పల్నాడు5
5/10

పల్నాడు

పల్నాడు6
6/10

పల్నాడు

పల్నాడు7
7/10

పల్నాడు

పల్నాడు8
8/10

పల్నాడు

పల్నాడు9
9/10

పల్నాడు

పల్నాడు10
10/10

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement