
డీజిల్ ట్యాంక్ పేలి కంటైనర్ దగ్ధం
యద్దనపూడి: టైరు పేలి కంటైనర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టటంతో డీజిల్ ట్యాంక్ పగిలి దగ్ధమైన సంఘటన తాతపూడి వద్ద శనివారం చోటు చేసుకుంది. హైవే మొబైల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళగిరి నుంచి చైన్నె పేపర్ లోడుతో వెళుతున్న కంటైనర్ టైరు తాతపూడి వద్దకు రాగానే ఒక్కసారిగా పేలింది. దీంతో అదుపుతప్పిన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు రేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.