సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి | - | Sakshi
Sakshi News home page

సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి

Oct 19 2025 6:19 AM | Updated on Oct 19 2025 6:19 AM

సంస్క

సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి

సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి బైక్‌ అదుపు తప్పి వైద్యుడి మృతి బెంగళూరులో ఇసుకదర్శి వాసి ఆత్మహత్య విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

నరసరావుపేట ఈస్ట్‌: సంస్కృతాంధ్ర పండితుడు, రంగస్థల నటులు జన్నాభట్ల లక్ష్మీనారాయణ (65) శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జన్నాభట్ల వినుకొండ నుంచి ద్విచక్ర వాహనంపై నరసరావుపేట వస్తుండగా పట్టణం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన జన్నాభట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సంస్కృతం, తెలుగు భాషా పాండిత్యం గల లక్ష్మీనారాయణ పట్టణంలోని పలు కళాశాలల్లో మూడు దశాబ్దాలకు పైగా సంస్కృతాంధ్ర పండితునిగా సేవలు అందించారు. కొంతకాలం నాగార్జున విశ్వవిద్యాలయం సెనెట్‌ సభ్యునిగా పనిచేశారు. రంగస్థల నటునిగా వివిధ పాత్రలకు జీవం పోశారు. జన్నాభట్లకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పట్టణంలోని అధ్యాపకులు, కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, రంగస్థల కళాకారులు జన్నాభట్లకు నివాళులర్పించారు.

తరిగొప్పుల: బైక్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్‌ (31) శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్‌ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్‌ కొన్నాడు. శుక్రవారం అదే బైక్‌పై తిరిగి మంచిర్యాలకు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్‌రోడ్‌ సమీపంలో మూలమలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అతడి తల, ఛాతీ భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు.

మార్టూరు: మండలంలోని ఇసుకదర్శి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వెంకట రమణయ్య (65) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కిందట బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడ ఉదయం నిద్ర లేచేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం గమనించిన కుమార్తె స్వగ్రామంలో బంధువులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని సాయంత్రం అక్కడకు తరలించారు.

అద్దంకి రూరల్‌: అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గురకాయపాలెం పాఠశాలలో శనివారం 356 మంది విద్యార్థినులకు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 వేల సైకిళ్లు పంపిణీ చేయాలని సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. అనంతరం కొరిశపాడు మండలం మేదరమెట్లలో ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. అనంతరం మేదరమెట్ల–తమ్మవరం బీటీ రహదారిని ప్రారంభించారు. కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌తో కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి  1
1/2

సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి

సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి  2
2/2

సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement