జీఎస్టీ తగ్గటం వల్ల గృహోపకరణాల ధరలు తగ్గాయి | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ తగ్గటం వల్ల గృహోపకరణాల ధరలు తగ్గాయి

Oct 19 2025 6:19 AM | Updated on Oct 19 2025 6:19 AM

జీఎస్టీ తగ్గటం వల్ల గృహోపకరణాల ధరలు తగ్గాయి

జీఎస్టీ తగ్గటం వల్ల గృహోపకరణాల ధరలు తగ్గాయి

జీఎస్టీ తగ్గటం వల్ల గృహోపకరణాల ధరలు తగ్గాయి

సోలార్‌ ఏర్పాటు చేసుకునే వారికి ప్రయోజనం అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యుత్‌శాఖ అధికారులు

నరసరావుపేట: సూపర్‌ సేవింగ్స్‌–సూపర్‌ జీఎస్టీ వల్ల విద్యుత్‌ గృహోపకరణాల ఉపకరణాల ధరలు తగ్గాయని, సోలార్‌ విద్యుత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చే వారికి లాభం కలుగుతుందని విద్యుత్‌ శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ ప్రత్తిపాటి విజయకుమార్‌ పేర్కొన్నారు. శనివారం సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్స్‌, సోలార్‌ విద్యుత్‌ అవగాహన ర్యాలీకి స్థానిక విద్యుత్‌ శాఖ కార్యాలయం ఆవరణలో పచ్చ జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ర్యాలీ శివుడు బొమ్మ సెంటర్‌ మీదుగా ప్రధాన రహదారిలో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెంటర్‌ వరకు, అక్కడి నుంచి పాండురంగస్వామి దేవాలయం మీదుగా కోట సెంటర్‌ నుంచి విద్యుత్‌ శాఖ కార్యాలయం వరకు కొనసాగింది. విద్యుత్‌ శాఖ సిబ్బంది ప్లకార్డులు పట్టుకొని దారి పొడవునా కరపత్రాలు పంపిణీ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీహెచ్‌.రాంబొట్లు మాట్లాడుతూ విద్యుత్‌ రంగ సంస్థలో గృహ వినియోగదారులకు అదనపు లోడు ఉంటే 50 శాతం రాయితీ ద్వారా లోడు క్రమబద్ధీకరణ పథకం ఉందని, దీనిని ప్రతి ఒక్క గృహ వినియోగదారుడు వినియోగించుకోవాలని కోరారు. ర్యాలీలో సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్లు రఫీ, సురేంద్రబాబు, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు సాంబశివరావు, మౌళి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement