
వైఎస్సార్‌సీపీలో పలువురు జిల్లా వాసులకు పదవులు
నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా నరసరావుపేటకు చెందిన గెల్లి బ్రహ్మారెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, గురజాలకు చెందిన కలకంధ అంధ్రయ్యను యాక్టివిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులుగా కండ్రకుంట మరియమ్మను నియమించారు.
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏడీ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పి నేటికీ అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నా రు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చేనేత రక్షణకు 11 రకా ల రిజర్వేషన్లు అమలు జరపాలని కోరా రు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలన్నా రు. చేనేత కార్మికులకు, సహకార సంఘాల్లో లేనివారికి ఇవ్వాల్సిన ట్రిప్ట్ ఫండ్ రూ.27 కోట్లను కూడా విడుదల చేయాలని కోరారు.
గుంటూరురూరల్: నగర శివారు లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ కళాశాలల జట్లు ప్రతిభ చాటాయి. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తెనాలి జె.ఎం.జె. డిగ్రీ కళాశాల, గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సైన్స్ విభాగం, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు తొలి నాలుగు స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. విజేతలను చైర్మన్ అభినందించారు.