
ప్రైవేటీకరణ చేసి పేదల కడుపు కొట్టొద్దు
రచ్చబండలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
మాచవరం: వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు, పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందించేందుకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి సమీపంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపడితే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగేశ్వరరావు తండా, శ్రీ రుక్మిణి పురం గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తే చంద్రబాబు విధానాల వల్ల రూ.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది పేదలకు సాధ్యమా అని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా అందరూ ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు కోసం సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రజల అండదండలతో పోరాడి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకొని తీరుతామన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలను, విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధితోపాటు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయంపాలన అందించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మడ్డు ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు శివయాదవ్, మండలం అభివృద్ధి కమిటీ చైర్మన్ దారం లచ్చిరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి చల్లా పిచ్చిరెడ్డి, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు గుర్రం గురవారెడ్డి, జిల్లా కార్యదర్శి జిలుగు నరసింహారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షులు సిద్ధారెడ్డి పుల్లారెడ్డి, గుమ్మ హుస్సేనయ్య, మండల యూత్ కన్వీనర్ ముండ్లపాటి చిన ఆంజనేయులు, మండల నాయకులు అంబటి కోటయ్య, అనిల్‌కుమార్, వంకాయల రమేష్, మహమ్మద్ జానీ, రాము, బ్రహ్మారెడ్డి, పెరుగు రోశయ్య, గ్రామ సర్పంచులు రామారావు, అనంగి వెంకటేశ్వర్లు, బత్తుల కృష్ణ, బాలాజీనాయక్, బాబురావు నాయక్, ఎంపీటీసీ సభ్యులు శ్రీశైలం నాయక్, గురవయ్య, సోషల్ మీడియా టీం సభ్యులు జక్కుల కొండలు, బాబు, రాజు, చిన్న అంజి, తదితరులు పాల్గొన్నారు.