
చిరు ధాన్యాల సాగు పెంపే లక్ష్యం
యడ్లపాడు: పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన చిరుధాన్యాలు(మిల్లెట్స్) దేశ ఆరోగ్య, ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘మిల్లెట్ మిషన్’ పేరిట ప్రత్యేక జీవో తీసుకొచ్చి వీటి సాగుకు ప్రోత్సాహం అందించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఊతం ఇవ్వడం..రాయితీపై యంత్రాలు అందించడం వంటి చర్యలు యువతకు, చిరుధాన్యాల సాగుకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. నేపథ్యంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు, తక్కువ ఖర్చుతో, వర్షాభావాన్ని తట్టుకునే ఏబీవీ–04 (అనంతపురం బాద్ర వైరెటీ) అనే దేశవాళీ సజ్జ రకాన్ని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కనుగొంది.
ఏబీవీ–04 ప్రత్యేకతలు, సాగు విజయవంతం...
ఈ కొత్త రకం సజ్జలో సాధారణ సజ్జల కంటే కాల్షియం, జింక్ వంటి పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉండి, దిగుబడి కూడా 20–25 శాతం అధికంగా వస్తుంది. జిల్లా ఏరువాక వ్యవసాయ పరిశోధన కేంద్రం మండలంలోని జాలాది గ్రామంలో 25 ఎకరాల్లో ఈ రకం ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం సాధించింది.
జాలాదిలో సజ్జసాగు ప్రయోగం
విజయవంతం
దిగుబడి ఆశాజనకంగానే....
ఏబీవీ –04 రకాన్ని తొలిసారిగా గ్రామంలో 23 ఎకరాలను సాగు చేశాను. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి అయింది. 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చేలా ఉంది. మార్కెట్‌లో జాతీయ కనీస ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2750 ఉంది. బహిరంగ మార్కెట్‌లో రూ.3వేలకు తగ్గనందున పెట్టుబడికి అంతే మొత్తం ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. ఎకరాకు సుమారు రూ.7వేల వరకు అవుతుంది. అదే ముందస్తు పంటగా సజ్జను సాగు చేస్తే కేవలం రూ.2వేలతో దుక్కి పనులు పూర్తవుతాయి. దీంతో రైతుకు రూ.5వేలు ఖర్చు కలిసి వస్తుంది.
–మానుకొండ శ్రీనివాసరావు,
సజ్జరైతు, జాలాది

చిరు ధాన్యాల సాగు పెంపే లక్ష్యం