
నకిలీ మద్యం కట్టడికి సురక్ష యాప్
నరసరావుపేట టౌన్: నకిలీ మద్యం కట్టడికి ప్రభుత్వం ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ తీసుకొచ్చిందని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా ఈఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్తీ మద్యం కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకై ్సజ్ సురక్ష పేరుతో రెండు యాప్‌లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఒకటి ఎకై ్సజ్ సురక్ష యాప్ కన్జ్యూమర్, రెండోది ఎకై ్సజ్ రక్ష యాప్ రిటైలర్, ఈ యాప్‌లను ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని మద్యం సీసాపై స్కాన్ చేస్తే సమగ్ర వివరాలు అందులో కనిపిస్తాయన్నారు. దీనివల్ల మద్యం సీసా ఒరిజినల్‌దో లేక నకిలీదో పసిగట్టవచ్చన్నారు. పల్నాడు జిల్లాలోని 142 లిక్కర్ షాపులు, 32 బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద మద్యం నాణ్యతను యాప్ ద్వారా పరిశీలించామన్నారు. మద్యం బాటిళ్ల మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మద్యం విక్రయించాలన్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం సంఘటన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 16 ఎస్‌హెచ్‌ఓల పరిధిలో అన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో నకిలీ మద్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఎక్కడా ఏవిధమైన నకిలీ మద్యం కానీ స్టాంపు డ్యూటీ చెల్లించని మద్యం కానీ లభించలేదన్నారు. నకిలీ మద్యం సమాచారం తెలిస్తే స్థానిక ఎకై ్సజ్ శాఖ ఎస్‌హెచ్‌ఓకి గాని, 14405 టోల్ ఫ్రీ నంబరుకు కానీ తెలియపరచాలన్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. ఎకై ్సజ్ శాఖ టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది బెల్ట్‌షాప్‌లు, నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో నాటు సారా నివారణకు పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కల్తీ సారా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఈఎస్ కె మణికంఠ, సీఐ కె.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్