
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
బాపట్ల టౌన్: మండలంలోని చెరువుజమ్ములపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్– 14 బాలబాలికల హాకీ టీంను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం. గోపి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపారు. పోటీలకు బాలురు 18, బాలికలు 18 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరంతా ఈనెల తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో జరిగే 69వ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో–2 డి. ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వి.కృష్ణారావు, ఉపాధ్యాయులు బి. గంగాధర్, ఎం. సాంబశివరావు, వాణీ సుశీల, ఏ.టి.రాంబాబు పాల్గొన్నారు.