
పల్నాడు
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో 9వ రోజైన మంగళవారం దుర్గగుడికి రూ.40.12 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. 2.29 లక్షల లడ్డూలను విక్రయించామని వివరించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం వేదసభ నిర్వహించారు. 450 మంది వేద పండితులు పాల్గొన్నారు.
వెల్దుర్తి: వజ్రాలపాడు సమీపంలోని చెరువులో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం మంగళవారం వైభవంగా నిర్వహించారు.
లింగారావుపాలెం శివాలయంలో
వనదుర్గాదేవి అలంకారంలో పార్వతీదేవి
సత్తెనపల్లిలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీదుర్గాదేవిగా...
దుర్గాదేవి అలంకారంలో
బాలచాముండేశ్వరి అమ్మవారు
వినుకొండలోని శంకర సత్సంగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న కన్యలు
దేవతాస్వరూపిణి దుర్గమ్మ
జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్య్రుత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉత్సవాలలో భాగంగా అమరావతిలోని బాల చాముండిక సమేత అమరేశ్వరాలయంలో మంగళవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని దుర్గతులను రూపుమాపే దుర్గాదేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దుర్గాదేవిని దర్శించి పూజలు నిర్వహించారు. వినుకొండలోని శంకర సత్సంగంలో కన్యలు పూజలు నిర్వహించారు. యడ్లపాడు మండలం లింగారావుపాలెంలోని శివాలయంలో వనదుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. – అమరావతి/వినుకొండ/సత్తెనపల్లి/యడ్లపాడు
I

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు