పేదలకు సబ్సిడీపై కందిపప్పు అందించే పద్ధతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. ‘‘ఈ నెల ఇస్తాం..వచ్చే నెల ఇస్తాం’’ అంటూ 16 నెలలుగా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం అక్టోబర్‌ నెలలో కూడా సరఫరాకు మంగళం పాడింది. ఈ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉండడంతో కందిపప్పు ఇస | - | Sakshi
Sakshi News home page

పేదలకు సబ్సిడీపై కందిపప్పు అందించే పద్ధతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. ‘‘ఈ నెల ఇస్తాం..వచ్చే నెల ఇస్తాం’’ అంటూ 16 నెలలుగా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం అక్టోబర్‌ నెలలో కూడా సరఫరాకు మంగళం పాడింది. ఈ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉండడంతో కందిపప్పు ఇస

Oct 1 2025 10:17 AM | Updated on Oct 1 2025 11:27 AM

పేదలకు సబ్సిడీపై కందిపప్పు అందించే పద్ధతికి కూటమి ప్రభు

పేదలకు సబ్సిడీపై కందిపప్పు అందించే పద్ధతికి కూటమి ప్రభు

కందిపప్పు లేకుండా అక్టోబర్‌లో సరఫరాకు ఏర్పాట్లు బయట మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న పేదలు ప్రజా పంపిణీలో కూటమి ప్రభుత్వ వైఫల్యం

6.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక భారం

నరసరావుపేట టౌన్‌: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే కందిపప్పు, పామాయిల్‌, గోధుమలు, రాగులు, జొన్నల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకులు పంపిణీకి నోచుకోవటం లేదు. అన్ని సరుకులు అందజేస్తే పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. చౌక దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.67కు కార్డుదారులకు అందిస్తున్నారు అదే బహిరంగ మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.105 వరకు పలుకుతొంది. ఏడాదికి పైగా చౌక దుకాణాల్లో కందిపప్పు అందకపోవటంతో పేదలు ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నూతన రేషన్‌న్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగష్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. రెండు రకాల యాప్‌లు ఏర్పాటు చేయటంతో సర్వర్‌ నెమ్మదించి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సరుకుల పంపిణీలో జాప్యం చోటుచేసుకొని కార్డుదారులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కందిపప్పుకు మంగళం

అక్టోబర్‌ నెలకు సంబంధించి బుధవారం నుంచి ప్రజా పంపిణీ ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం, పంచదార మాత్రమే చౌకదుకాణాలకు దిగుమతి అయ్యాయి. పండుగల సీజన్‌న్‌ లోనైనా ప్రభుత్వం పేదల కడుపు నిండేలా చర్యలు తీసుకుంటుందనే ఆశతో కార్డుదారులు రేషనన్‌ దుకాణాలకు వెళ్లారు. కానీ ప్రభుత్వం కందిపప్పు అందించకపోవడం వారికి తీవ్ర నిరాశ కలిగించింది. పండుగ కోసం అదనంగా ఖర్చులు చేయాల్సి వచ్చే ఈ సమయంలో మార్కెట్‌లో కిలో రూ.100కు పైగా వెచ్చించి కందిపప్పు కొనుగోలు చేయడం పేదల జేబులకు మరింత భారమైపోయింది. కందిపప్పు నిలిచిపోవడంతో పేద కుటుంబాలు మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. పండుగ సీజన్‌లోనూ ఉపశమనం ఇవ్వలేకపోవడం ప్రభుత్వం వైఫల్యాన్ని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు.

పల్నాడు జిల్లా వ్యాప్తంగా 6,34,114 రైస్‌ కార్డులు ఉండగా అందులో 18,36,592 మంది సభ్యులు ఉన్నారు. వారికి నెలనెలా కేజీ చొప్పున కార్డుదారులకు సబ్సిడీపై అందించాలి. వీటితోపాటు జిల్లాకు నూతనంగా అర్హత పొందిన సుమారు 13 వేల మందికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. పాత కార్డుదారులతోపాటు నూతనంగా మంజూరైన వారికి కందిపప్పు అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రేషన్‌ దుకాణాల్లో కందిపప్పు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ప్రజాపంపిణీపై కార్డుదారులు పెదవి విరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement