
సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ధ్యేయం
పీజీఆర్‌ఎస్‌లో 151 అర్జీలు స్వీకరించిన జేసీ, అధికారులు
నరసరావుపేట: అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కారం తీరు వుండాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 151 అర్జీలు డీఆర్‌ఓ మురళి, పలువురు జిల్లా అధికారులతో కలిసి స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నాకు 95 ఏళ్లు, నాకు వచ్చే పింఛన్‌ను గతేడాది తొలగించారు. చిన్న కుమారుడు హైదరాబాదులో ఉంటుండగా అక్కడకు వెళ్లాను. వరుసగా మూడు నెలలపాటు పింఛన్ తీసుకోలేదు. ఆ తర్వాత వచ్చి పింఛన్ అడిగితే నీపేరు లేదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నాకు ప్రతి నెలా పింఛన్ వస్తుండేది. నేను పెద్దకుమారుడి వద్ద ఉంటున్నా. వారు కూడా ఆర్థికంగా బలహీనులు. నాకు అదే జీవనాధారం.
–ఎన్.సీతారావమ్మ,
పిల్లుట్ల, మాచవరం మండలం
వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించిన మహాకవి గుర్రం జాషువా పేరు పల్నాడు జిల్లాకు పెట్టాలి. ఆయన పేరు పెట్టడం జిల్లాకే గర్వకారణం. ప్రజల మనోభావాలను గౌరవించి జాషువా పేరు పెట్టాలి.
–సీహెచ్.జాన్‌సుందరరావు, గుర్రం
జాషువా పల్నాడు జిల్లా సాధన కమిటీ

సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ధ్యేయం

సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ధ్యేయం